Download PDF

తెలుగు లో చారిత్రక కావ్య రచన

Author : డాక్టర్ ద్వివేది కృష్ణ గాయత్రి

Abstract :

చారిత్రక కావ్యము అనగా చరిత్రను ఇతివృత్తముగా కలిగిన కావ్యము. చారిత్రక కావ్యాల ద్వారా రాజులు,రాజ వంశాలు, వారి పరిపాలనా విధానాలు తెలుసుకోవడానికి వీలవుతుంది. సంస్కృత భాషలో ఉన్న ఇతిహాసాలు, పురాణాలు, కల్హణుని రాజ తరంగణి మొదలైనవి చరిత్ర ను వివరించే గ్రంథాలు. తెలుగులో వల్లభాభ్యుదయం, ప్రతాపరుద్రీయం, శ్రీ సిద్ధేశ్వర చరిత్ర మొదలైనవి చారిత్రక కావ్యాలు. భారతీయుల చారిత్రక దృష్టిని గురించి రవీంద్రనాథ్ టాగూర్, విశ్వనాధ వంటి వారు వివరించారు. శ్రీ శ్రీ' దేశ చరిత్రలు అనే కవిత లో కూడా భారతీయుల చారిత్రక దృష్టి సమర్థన కనబడుతుంది.ఆధునిక తెలుగు సాహిత్యం లో జాతీయోద్యమ ప్రభావంతో అనేక చారిత్రక గ్రంథాలను కవులు రచించారు. యాత్ర చరిత్రలు, స్వీయ చరిత్రలు ద్వారా సమకాలీన చారిత్రక, సామాజిక స్థితి గతులు తెలుసుకోవడానికి ఆధారమవుతున్నాయి.

Keywords :

చరిత్ర రచనకు సంబంధించిన కావ్యాలు - రాజులు, రాజ వంశాలు,వారి చరిత్రలు - భారతీయుల చారిత్రక దృష్టి - ఇతిహాసాలు, పురాణాలు - పురాణం పంచలక్షణం - క్రోమాన్యాన్ గుహముఖాల్లో చారిత్రక విభాత సంధ్యల మానవ కథా వికాసం - ఆధునిక చారిత్రక కావ్యాలు.