తెలుగులో చంపూ కావ్యము-పరిశీలన
Author : డాక్టర్ పసుపులేటి నాగమల్లిక
Abstract :
సమాజానికి మేలు చేకూర్చేది సాహిత్యం.అలాంటి సాహిత్యంలో భాగంగా కావ్యం, కథ, శతకం, నవల, నాటకం, వ్యాసం మొదలైన ప్రక్రియలెన్నో పుట్టుకొచ్చాయి.
భారతీయాలంకారికులు ఛందస్సును ప్రమాణంగా స్వీకరించి, కావ్యాన్ని పద్య, గద్య, చంపూ కావ్యాలని మూడు రకాలుగా విభజించారు.చంపూ కావ్యం
అనగా పద్యగద్య సమ్మిళితం.
అంటే పద్యం, గద్యం రెండూ కలిసి ఉంటాయి. దీనినే గద్యపద్యోభయ కావ్యం అంటారు.ఉదాహరణగా కవిత్రయ ఆంధ్ర మహాభారతంలో కొన్ని గద్య పద్యాలను పరిశీలిద్దాం.
సభాపర్వంలో ద్రౌపదీ వస్త్రాపరహణ సందర్భంలో దుశ్శాసనుని పై భీముడు కోపోద్రిక్తు డయ్యాడు. ఆ కోపాన్ని నన్నయ ఈ పద్యంలో చూపాడు.
“కురువృద్ధుల్ గురువృద్ధబాంధవులనేకుల్ సూచుచుండన్ మదో....”
ఉదాహరణకి విరాటపర్వంలో పాండవులు ద్రౌపది విరాటని కొలువులో ఏ విధంగా మసులుకోవాలో వాళ్ళ పురోహితుడైన ధౌమ్యుడు చెప్పే సందర్భంలోనివి ఈ క్రింది తిక్కన్నకిష్టమైన వచన రచన:
“వ. కావున మీకు నప్రమాదార్ధంబుగా నానేర్చినవిధంబున నుపదేశం”
ఈ విధంగా కవిత్రయ మహాభారతమే కాకుండా చంపూ కావ్య పద్ధతికి మొల్ల రామాయణంలోని పద్య, గద్యాలను పరిశీలిద్దాం.
సీతాదేవి అశోకవనంలో ఉండగా అక్కడ ఆమెకు కాపలాగా ఉన్న త్రిజట అనే రాక్షస స్త్రీ ఒక కలగంటుంది. ఆ సన్నివేశాన్ని ఈ క్రింది పద్యం ద్వారా వివరిస్తుంది.
“మ.
కలగంటిన్ వినుఁ డింతులార మనలంకాద్వీప మీయబ్ధిలో పల వ్రాలన్..”
ఆ సందర్భంలోనే ఒక వచనం ద్వారా అక్కడ పరిస్థితిని వివరిస్తుంది.
“వ. అప్పుడు యామినీచరకామినులు రావణానుమతంబున...”
ఈ విధంగా ప్రాచీన తెలుగు సాహిత్యంలో దాదాపుగా ఎక్కువ చంపుకావ్యాలే కనిపిస్తాయి.
Keywords :
పద్యం చతుష్పదమ్’, అపాద: పద సంఘాత: గద్యం’, గద్యపద్యోభయ కావ్యం, గద్యం కవీనాం నికషం వదంతి”, వృత్తగంధి.